గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (16:36 IST)

ఇన్సూరెన్స్ డబ్బు కోసం.. కాఫీలో భర్తకు విషం.. బ్లీచింగ్ పౌడర్ కూడా

క్షణికావేశాలు హత్యకు దారితీస్తున్నాయి. ఫలితంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలే హత్యలకు కారణం అవుతున్నాయి. తాజాగా అమెరికాలోని అరిజోనా రాష్ట్రానికి చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్తకు రోజూ కొంచెం చొప్పున విషం కలిపి ఇస్తూ, అతడిని అంతమొందించేందుకు ప్రణాళిక వేసింది. అయితే దీన్ని ఆమె భర్త కనిపెట్టేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్తకు రోజూ స్లో -పాయిజన్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. తన భార్య నిజస్వరూపాన్ని ఆమె భర్త కనుగొన్నాడు. సీసీటీవీ కెమెరా ద్వారా భార్య చేస్తున్న విషయాన్ని  కనుగొన్నాడు. 
 
తొలుత భార్య తనకు ఇచ్చే కాఫీ కప్పులో బ్లీచ్ పౌడర్ కలుపుతుండగా, ఆమె భర్త రాబీ జాన్సన్ దాన్ని రహస్యంగా వీడియో తీసి పోలీసులకు పంపించాడు. కాఫీలో ఒక రకమైన వాహన రావడంతో ఈ విషయాన్ని భర్త కనుగొన్నాడు. 
 
తన భర్త మరణిస్తే వచ్చే పరిహారం కోసం ఆమె ఇలా చేసినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బాధితుడు యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేసే రాబీ జాన్సన్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.