ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (14:15 IST)

వెనెజులా అధ్యక్షుడిపై డ్రోన్లతో దాడి.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురో శనివారం హత్యయత్నం జరిగింది. ఆయనపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ దేశ నేషనల్ గార్డ్స్ 81వ యానివర్శిరీ కార్యక్రమం జరి

వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురో శనివారం హత్యయత్నం జరిగింది. ఆయనపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ దేశ నేషనల్ గార్డ్స్ 81వ యానివర్శిరీ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
 
నికోలస్ ఉన్న ప్రాంగణంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి పేలుడు పదార్థాలు నింపిన డ్రోన్లు పేలాయి. ఈ డ్రోన్ల దాడి నుంచి అధ్యక్షుడు నికోలస్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే పేలుడు పదార్థాలు అంత శక్తివంతమైనవి కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్ధానిక మీడియా తెలిపింది. 
 
ఈ డ్రోన్ల దాడి ఖచ్చితంగా పొరుగు దేశమైన కొలంబియా, కొంతమంది అమెరికా ఫైనాన్సర్లు పనేనని అధ్యక్షుడు నికోలస్ మాదురో అంటున్నారు. ఈ దాడిలో ప్రమేయమున్న అనుమానితులను ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరికొందరిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించే పనిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణకు మాదురో ఆదేశించారు.