శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (19:13 IST)

ఎక్కువసేపు కూర్చోకండి.. 3 నిమిషాలు వాకింగ్ చేయండి..

Morning walk
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ ఎక్కువసేపు కూర్చోవడం మన ఆరోగ్యానికి హానికరం. ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి 30 నిమిషాలకు 3 నిమిషాల లైట్ ఇంటెన్సిటీ వాకింగ్ టైప్-1 డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సాయపడుతుందని తేలింది. టైప్-1 డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక పరిస్థితి, దీనిలో ప్యాంక్రియాస్ తక్కువ లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు.
 
కూర్చునే సమయంలో చిన్న విరామాలు తీసుకోవడం మంచిది. నిరంతరాయంగా కూర్చోవడంతో పోలిస్తే, సగటు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి.