శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (17:59 IST)

కీవ్‌పై ఇంకా పట్టుకోల్పోలేదు : ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ

తమ దేశం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉన్నామని, తమ రాజధాని కీవ్‌పై ఇంకా తాము పట్టుకోల్పోలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. రాజధాని కీవ్ నగరం ఇంకా తమ ఆధీనంలో ఉందన్నారు. వంతెనలను కూల్చివేసి రష్యాను నిలువరించినట్టు చెప్పారు. 
 
కాగా, ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆధీనంలో తీసుకున్న రష్యా సైనిక బలగాలు కీవ్ నగరాన్ని కూడా ఏ క్షణమైనా తమ ఆధీనంలోకి తీసుకుంటామని రష్యా ప్రకటించింది. ఆ వెంటనే జెలెన్ స్కీ ఓ సంచలన సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. రాజధాని కీవ్‌పై తాము ఇంకా పట్టుకోల్పోలేదన్నారు. ఇప్పటికీ కీవ్ నగరం తమ ఆధీనంలో ఉందని తెలిపారు. 
 
మరోవైపు, కీవ్ నగరంతోపాటు ఉక్రెయిన్ దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకునేలా వెనక్కి తగ్గరాదని ఉక్రెయిన్ గడ్డపై యుద్ధం చేస్తున్న సైనిక బలగాలకు రష్యా అధినేత పుతిన్ ఆదేశాలు జారీచేశారు. పుతిన్ భావనను ముందుగానే పసిగట్టిన ఉక్రెయిన్ బలగాలు నగరం చుట్టూత ఉన్న బ్రిడ్జిలను కూల్చివేసి రష్యా బలగాలు చొరబడకుండా అడ్డుకట్ట వేశాయి.
 
ఇదే అంశాన్ని ప్రస్తావించిన జెలెన్ స్కీ కీవ్ నగరంపై తాము ఎంతమాత్రం పట్టుకోల్పోలేదని, కీవ్ నగరం ఇంకా తమ ఆధీనంలోనే ఉందని తెలిపారు. అంతేకాకుండా, రష్యా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు ముందుకు వస్తే వారికి ఆయుధాలు సమకూర్చుతామని ఆయన ప్రకటించారు.