బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:38 IST)

మోదీని మాకిచ్చేయండి.. పాకిస్థాన్ బాగుపడుతుంది.. ఎవరు?

Modi
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్, పాత్రికేయురాలు సనా అంజాద్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
పాకిస్థాన్ పౌరుడొకరు షేబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. అల్లా కనుక భారత ప్రధాని మోదీని తమకు ఇచ్చేస్తే పాకిస్థాన్ బాగుపడుతుందని పేర్కొన్నాడు. 
 
తమకు మోదీ ఒక్కడు చాలు.. నవాజ్ షరీఫ్ వద్దు.. ఇమ్రాన్ ఖాన్ వద్దు, బేనజీర్‌లు, ముషారఫ్‌లు తమకు వద్దని స్పష్టం చేశాడు. మోదీ కనుక పాకిస్థాన్‌ను పరిపాలిస్తుంటే నిత్యావసరాలన్నీ అందుబాటు ధరలకే లభ్యమయ్యేవని ఆ పౌరుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
భారతదేశానికి వెళ్లి తలదాచుకున్నా ఫర్వాలేదు... పాకిస్థాన్ లో మాత్రం ఉండొద్దు అనే నినాదాన్ని అతను బలపరిచాడు.