ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (21:55 IST)

వారణాసిలో రిక్షాపై చక్కర్లు కొట్టిన ఆర్కే (వీడియో వైరల్)

rk roja
ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీనటి రోజా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ప్రజా సంబంధిత విషయాలపై వెంటనే స్పందించడంతో పాటు తన అభిమానులతో టచ్‌లో వుంటారు. 
 
తాజాగా రోజా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకున్న అనంతరం.. పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
అలాగే వారణాసి నగరంలో రిక్షాలో రోజా చక్కర్లు కొట్టారు. రిక్షాలో రోజా వారణాసిని చుట్టేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.