Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2017: విరాట్ కోహ్లీ శ్రమవృధా... ముంబై హ్యాట్రిక్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో అంచె పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన ముంబై జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది.

Written By pnr
Updated: శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (20:29 IST)
 
బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓడిపోతుందనుకున్న తరుణంలో కీరన్ పొలార్డ్ (70), క్రునాల్ పాండ్యా (37) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో బెంగళూరుపై ఏడు బంతులు మిగిలుండగానే ముంబై విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని 143గా నిర్దేశించింది. బెంగళూరు జట్టులో కెప్టెన్ కోహ్లీ (47 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్సులు)తో అర్థ సెంచరీతో ఒంటరిపోరాటం చేశాడు. కానీ, క్రిస్ గేల్ 22 పరుగులు, ఏబీ డివిలియర్స్ (19), కేదర్ జాదవ్(9), మన్ దీప్(0)లు రాణించలేక పోవడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ రెండు వికెట్లు తీసుకోగా, హర్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.
 
అనంతరం 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఏడు పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది. జాస్ బట్లర్ 2, పార్థీవ్ పటేల్ 3, క్లీనెగన్ 0, రోహిత్ శర్మ 0లు వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో 2.4 ఓవర్లలో ఏడు పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత పొలార్డ్ (70), పాండ్య (37) వీరోచిత బ్యాటింగ్ పుణ్యమాని ముంబై జట్టు మరో ఏడు బంతులు మిగిలివుండగానే 145 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ శ్యామ్యూల్ బద్రి హ్యాట్రిక్ సాధించాడు. పార్ధీవ్ పటేల్, మెక్లెంగన్, రోహిత్ శర్మలను వరుస బంతుల్లో అవుట్ చేశాడు.
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

దేశంలో వింత వాతావరణం : ఉత్తరాదిన కుండపోత వర్షాలు.. దక్షిణాదిన పొడి వాతావరణం

మధ్యప్రదేశ్‌లో వింత శిశువు - నాలుగు కాళ్లు - నాలుగు చేతులు (వీడియో)

వివాహితతో ఏకాంతంగా ప్రియుడు, బైట తలుపుకి గొళ్లెం పెట్టిన స్థానికులు, ఆ తర్వాత?

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ విషయంలో అడ్డంకులు..

కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు.. కాంగ్రెస్ కమిటీ సిఫార్సు

అన్నీ చూడండి

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments