సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

ఐపీఎల్ 10 : అమీ జాక్సన్ ఆట - రెహ్మాన్ పాట... సర్వాంగ సుందరంగా ఉప్పల్ స్టేడియం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ ఆరంభ వేడుకలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ ఆరంభ వేడుకలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. దీంతో ఐపీఎల్ పదవ సీజన్ ఆరంభ వేడుకలు అదిరిపోయే రీతిలో సాగనున్నాయి. 
 
రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 6:20కి ప్రారంభ వేడుక మొదలవుతుంది. తొలుత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌‌లు గోల్ఫ్‌ కార్ట్‌‌లలో మైదానంలోకి ప్రవేశిస్తారు. ఆపై వీరి ఘనతలు, సాధించిన రికార్డులను ప్రస్తావిస్తూ ఓ ఆడియో, వీడియో ప్రదర్శన ఉంటుంది. 
 
అనంతరం రవిశాస్త్రి వ్యాఖ్యాతగా, వీరంతా ప్రసంగిస్తారు. క్రికెటర్లకు సన్మానం తర్వాత బాలీవుడ్‌ నటి అమీ జాక్సన్‌ 300 మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన ఇవ్వనుంది. పిమ్మట ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి ఉంటుంది. ఇక ఈ ఆరంభ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.