ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (18:12 IST)

అది వైడ్ బాలా? కాదా? కోపంతో చూస్తూ గొణిగిన ధోనీ- వీడియో వైరల్ (video)

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌‌లో భాగంగా చెన్నై-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 20 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా చెన్నై జట్టు ఆరో స్థానానికి ఐపీఎల్ పట్టికలో ఎగబాకింది. సన్‌రైజర్స్‌పై గెలవడం కోసం చెన్నై ఆటగాళ్లు పడిన కష్టాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ధోనీ వీడియో ఒక ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో చెన్నై కెప్టెన్ ధోనీ కోపంగా చూస్తున్నట్లుంది. ఆటకు 19వ ఓవర్ వద్ద సీఎస్‌కే ప్లేయర్ శార్దూల్ బంతిని విసిరాడు. ఆ ఓవర్ రెండో బంతిని రషీద్ ఖాన్ ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో బంతిని ఆఫ్ స్టంప్‌కు బయట విసిరాడు శార్దూల్ ఠాగూర్. ఆ బంతి వైడ్‌లా తెలిసింది. అంతకుముందు కూడా ఇదే తరహాలో బంతి వైడ్ అయ్యింది. దానికి అంపైర్ వైడ్ అని ప్రకటించాడు. ఈసారి కూడా వైడ్ అని ప్రకటించేందుకు అంపైర్ చేతినెత్తడంతో ధోనీ అంపైర్‌ను కోపంగా చూశాడు. 
 
అంతటితో ఆగకుండా నోటితో ఏదో గొణికాడు. దీన్ని చూసిన హైదరాబాద్ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా కోపంతో చూశాడు. కారణం తద్వారా హైదరాబాదుకు ఒక పరుగు లభించకపోవడమే. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.