శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (17:33 IST)

'ఈల' వెయ్... నెట్.. సెట్... గో అంటున్న సీఎస్కే.. రాత్రివేళ ముమ్మర సాధన!! (Video)

ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈల వెయ్ (విజిల్ పోడు)... నెట్... సెట్.. గో అంటోంది. ఐపీఎల్ 2020 కోసం యూఏఈ గడ్డపై ఈ జట్టు అడుగుపెట్టింది. కానీ, అక్కడకు వెళ్లిన తర్వాత జట్టులోని ఇద్దరు ఆటగాళ్లతో పాటు.. 11 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో తమతమ హోటల్ గదులకే పరిమితమైవున్నారు. అయితే, రాత్రిపూట మాత్రం వారు కఠోర సాధనలో నిమగ్నమవుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సీఎస్కే యాజమాన్యం విడుదల చేసింది. 
 
నిజానికి ఈ టోర్నీ కోసం అందరికంటే ప్రాక్టీస్ మొదలుపెట్టాలని విమానమెక్కింది. కానీ, కరోనా వైరస్ కారణంగా అందరికంటే చివరగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందుకుకారణం సీఎస్‌కేను కరోనా కలవరపెట్టడమే. ఇందులో ఇద్దరు ఆటగాళ్లతో పాటు 11 మంది సీఎస్‌కే సిబ్బంది ఉన్నారు. దాంతో సీఎస్‌కే ప్రాక్టీస్‌ ఆలస్యమైంది. 
 
అయితే, గత శుక‍్రవారం ప్రాక్టీస్‌ చేసిన సీఎస్‌కే.. దాన్ని ముమ్మరం చేసింది. ప్రాక్టీస్‌ ఆలస్యం కావడంతో సీఎస్‌కే ఎక్కువగా శ్రమిస్తోంది. దీనికి సంబంధించిన ఒక నైట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ను సీఎస్‌కే తన ట్విట్టర్ హ్యాండిల్‌ పోస్ట్‌ చేసింది. దీనికి నెట్.‌. సెట్..‌. గో.... అనే క్యాప్షన్‌ ఇచ్చిన సీఎస్‌కే.. "స్టార్ట్‌ ద విజిల్స్‌, విజిల్‌ పోడు"లను ట్యాగ్‌ చేసింది. 
 
ఈ వీడియోలో కెమెరాలన్నీ కెప్టెన్‌ ధోనీ మీదనే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి. ఎంఎస్‌ ధోనీ, వాట్సన్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయగా, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, పీయూష్‌ చావ్లాలు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌.. ఆటగాళ్లతో మమేకమై ప్రాక్టీస్‌లో భాగమయ్యాడు. కాగా, ఈ ఐపీఎల్ 2020 నుంచి సీనియర్ ఆటగాళ్లైన సురేష్ రైనా, స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లు వైదొలిగిన సంగతి తెలిసిందే.