బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (17:56 IST)

అసుస్ రోగ్ ఫోన్ 3పై భారీ తగ్గింపు.. ఎంతో తెలుసా?

Asus ROG Phone 3
గేమింగ్ ఫోన్ అసుస్ రోగ్ ఫోన్-3పై భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించింది. దీనిపై ఏకంగా రూ.3,000 తగ్గింపును అందించారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.49,999 నుంచి రూ.46,999కి తగ్గింది. ధర తగ్గింపుతో పాటు దీనిపై ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాలీ సేల్‌లో అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,999కు, 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999కు, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999కు తగ్గింది. సింగిల్ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎక్స్‌చేంజ్‌పై రూ.14,850 తగ్గనుంది.