మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (10:10 IST)

పబ్‌జీపై నిషేధం.. నేటి నుంచే భారత్‌లో పబ్‌జీకి మంగళం

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ అయిన భారత్‌లో పబ్ జి గేమ్‌ను నిషేధించారు. పబ్‌జితో పాటు చైనాకు చెందిన 100 యాప్‌లను సర్కారు గతంలో నిషేధించింది. జూన్ నెలలో టిక్ టాక్‌తో పాటు ఇతర చైనా యాప్‌లను భారత్ నిషేధించింది. భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించే అనువర్తనాలను ఐటీ మంత్రిత్వశాఖ నిషేధం విధించింది. 
 
సైబర్ సెక్యూరిటీ సమస్యలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పబ్ జి గేమ్‌ను అక్టోబరు 30 వతేదీ నుంచి దేశంలో నిలిపివేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. పాపులర్ పబ్ జి గేమ్ పిల్లలపై చెడు ప్రభావం చూపిస్తుందని దాన్ని నిషేధించారు. ఈ గేమ్ వల్ల పిల్లల చదువులకు తీవ్ర ఆటంకంగా మారింది. దీనివల్ల గతంలో కొందరు పిల్లలు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. పబ్‌జీ గేమ్‌పై నేటి నుంచి నిషేధం అమలు చేస్తున్నారు.