శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (16:53 IST)

పబ్‌జీ గేమింగ్‌ యాప్‌.. మళ్లీ భారత్‌లోకి ఎంట్రీ.. తల్లిదండ్రుల ఆందోళన

చైనా కంపెనీ టెన్సెంట్‌ గేమ్స్‌ 1.5 పర్సెంట్ షేర్‌ను బ్లూహోల్‌ స్టూడియో కొనుగోలు చేసిన నేపథ్యంలో పబ్‌జీ మొబైల్‌పై ఇండియా ఆ నిర్ణయం తీసుకుంది. దానితో పాటు 117 చైనా యాప్‌లపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే టెన్సెంట్‌ గేమ్స్‌ నుంచి పబ్‌జీ కార్ప్‌ పబ్లిషింగ్‌ రైట్స్ వెనక్కి తీసుకుంది. 
 
పబ్‌జీ గేమింగ్‌ యాప్‌పై ఇండియాలో నిషేధం విధించడంతో భారతదేశంలో చాలామంది తల్లిదండ్రులు హ్యాపీగా వున్నారు. ఈ ప్రమాదకర గేమ్ బారి నుంచి తమ పిల్లలు బయటపడ్డారని సంతోషించారు. అయితే వారందరికీ షాక్ ఇచ్చేలా పబ్‌జీ గేమింగ్‌ యాప్ తిరిగి భారత్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. పబ్‌జీ కార్పొరేషన్‌ ఓనర్, దక్షిణ కొరియాకు చెందిన క్రాఫన్‌ సంస్థ భారత్‌లో నియామకాలు చేపట్టడం కోసం లింక్డ్‌ఇన్‌లో ఈ నెల 20న కొన్ని జాబ్స్ పోస్ట్‌ చేసింది. 
 
'కార్పొరేట్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ మేనేజర్‌' బాధ్యతలు చేపట్టేవారి కోసం అందులో పోస్ట్‌ పెట్టడం చూస్తుంటే.. ఆ మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ తిరిగి ఇండియాలో యాక్టీవ్ అవ్వబోతుందన్న వార్తలకు బలం చేకూరుతుంది. టెన్సెంట్‌ పేరిట కాకుండా.. క్రాఫన్‌ పేరుతో ఆ పోస్ట్‌ పెట్టింది. కాగా, పబ్‌జీ గేమ్‌ మొబైల్‌ వెర్షన్‌పై ఇండియాలో బ్యాన్ ఉండగా.. కన్సోళ్లు, పీసీలపై ఇప్పటికీ కొందరు వినియోగిస్తున్నారు.
 
మరో వైపు, బ్యాన్ కేవలం కొత్త డౌన్‌లోడ్లకు, బాటిల్‌ రాయల్‌ ఆటను ఆడకుండా ఉండేందుకు మాత్రమే వర్తిస్తుంది. ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఆ యాప్‌ను తీసివేయడానికి ముందే ఇన్‌స్టాల్‌ చేసుకునేవారు మాత్రం పబ్‌జీ గేమ్‌ ఆడుకోవచ్చు.