ganesh chaturthi

భారత్‌లో 348 యాప్స్‌పై నిషేధం.. మంత్రి చంద్రశేఖర్

Written By సెల్వి
Updated: శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:55 IST)
భారత్‌లో యాప్స్ బ్యాన్ గురించి కేంద్రం తాజాగా అధికారిక ప్రకటన చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ విషయంపై కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాచారం వెల్లడించారు.
 
దేశంలో ఇప్పటి వరకు 348 యాప్స్‌పై నిషేధం విధించినట్టు మంత్రి చంద్రశేఖర్ ప్రకటించారు. భారత యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్ సేకరించి.. వేరే దేశాల్లో ఉన్న సర్వర్‌లకు చేరవేస్తున్నట్టు గుర్తించామని, అందుకే బ్యాన్ చేసినట్టు వెల్లడించారు. 
 
విదేశాల్లోని సర్వర్స్‌కు యూజర్ల డేటాను పంపుతున్న 348 యాప్స్‌ను గుర్తించి, బ్యాన్ విధించామని ప్రకటించారు. ఇలా విదేశాలకు డేటా చేరితే భారత సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అందుకే బ్యాన్ చేసినట్టు స్పష్టం చేశారు.
 
తాజాగా బ్యాటిల్ రొయాల్ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్ మొబైల్‌ ఇండియా (BGMI)పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ఈ గేమ్‌ను తొలగించాయి. ఐటీ యాక్ట్ 2020 కిందే BGMIను కూడా నిషేధించింది. 

అన్నీ చూడండి

Varun Tej : వాయువ్ ముఖాన్ని చూపిస్తూ అందమైన జీవితంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పోస్ట్

ఇరుముడి సైలెంట్ హిట్: పొంగిపోతున్న మాస్ మహరాజ రవితేజ, వీడియో

Epic movie review: బేబి జంట ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సక్సెసా? కాదా? ఎపిక్ మూవీ రివ్యూ

అపుడు నటనకు పూర్తిగా స్వస్తి పలకాలని అనుకున్నాను : సమంత

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

తర్వాతి కథనం
Show comments