శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (18:14 IST)

వావ్.. వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్స్.. అవేంటో తెలుసా? (video)

ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. మొబైల్‌ యాప్‌లో మరో ఐదు కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేసిన వాట్సాప్‌... త్వరలో గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ పరిమితిని ఎనిమిదికి పెంచింది. ఇంత వరకూ నలుగురికి మించి గ్రూప్‌ కాల్‌ చేసుకునే అవకాశం ఉండేది కాదు. 
 
అలాగే, మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. అలాగే, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా కొత్త కాంటాక్ట్స్‌ను జోడించుకునే అవకాశం ఉంది. 
 
అదేవిధంగా 24 గంటల్లో స్టోరీలు, స్టేటస్‌లు అదృశ్యమయ్యేలా సెల్ఫ్‌ డిస్ట్రక్టింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ను త్వరలో అందించనుంది. ఇన్‌ యాప్‌ బ్రౌజర్‌ ఫీచర్‌పైనా వాట్సాప్‌ కసరత్తు చేస్తోంది. లాస్ట్‌ సీన్‌ ఆప్షన్‌ కేవలం ఫ్రెండ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండే ఫీచర్‌ను జోడించబోతున్నట్లు వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.