Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేలిపోతున్న ఐఫోన్ 8.. వినియోగదారుల గగ్గోలు!

మొబైల్ ఫోన్ దిగ్గజం ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 8, 8 ప్లస్ విడుదలై నెలరోజులైనా కాకముందే అప్పుడే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఐఫోన్ 8 ప్లస్ మొబైల్‌ను కొనుగోలు చేసిన తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి తాను చార్జి

Written By pnr
Updated: ఆదివారం, 1 అక్టోబరు 2017 (15:49 IST)
మొబైల్ ఫోన్ దిగ్గజం ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 8, 8 ప్లస్ విడుదలై నెలరోజులైనా కాకముందే అప్పుడే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఐఫోన్ 8 ప్లస్ మొబైల్‌ను కొనుగోలు చేసిన తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి తాను చార్జింగ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఫోన్ పేలిపోయింది. 
 
తైవాన్, చైనా మీడియా కథనం ప్రకారం యు అనే మహిళ ఇటీవల ఐఫోన్ 8, 64 జీబీ వెర్షన్‌ను కొనుగోలు చేసింది. ఫోన్ కొనుగోలు చేసిన ఐదు రోజు తర్వాత యు ఆ ఫోన్‌కు చార్జింగ్ పెట్టింది. మూడు నిమిషాల తర్వాత చూస్తే ఫోన్ ఫ్రంట్ పానెల్ ఉబ్బిపోయి కాస్త పైకి లేచి కనిపించింది. ఆ తర్వాత కాసేపటికి మొత్తం పైకి లేచి వచ్చింది. దీంతో ఈ ఫోన్‌ను వెనక్కి తీసుకున్న ఔట్‌లెట్ ఆ ఫోన్‌ను వెనక్కి తీసుకుని కంపెనీకి పంపించినట్టు తెలుస్తోంది.
 
ఐఫోన్ 8ప్లస్ కొనుగోలు చేసిన మరో వ్యక్తి కూడా ఇదే రకమైన ఫిర్యాదు చేశారు. ఓ జపాన్ వ్యక్తి కూడా తన ఫోన్ ఇలానే బాడీతో స్క్రీను వేరు అయిందని కంప్లైంట్ చేశారు. కాగా, తాజా ఫిర్యాదులపై ఐఫోన్ అధికారికంగా స్పందించలేదు. 
 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

Tanikella Bharani: మినీ శంకరాభరణం తరహాగా పాటకు ప్రాణం చిత్రం ప్రారంభం

Sundeep Kishan: సందీప్ కిషన్ చిత్రం సిగ్మా రిలీజ్ కు రెండు అగ్ర సంస్థలు అండగా నిలిచాయ్

ఫ్యామిలీ నడపలేకపోతున్నా, బ్యాంక్ ఎకౌంట్స్ అన్‌ఫ్రీజ్ చేయించండి ప్లీజ్: ఐబొమ్మ రవి రిక్వెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో సైకలాజికల్ థ్రిల్లర్ హతహ: టీజర్ ఫిక్స్:

తర్వాతి కథనం
Show comments