గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (23:29 IST)

హైదరాబాద్‌లో సైబర్ దాడి.. రూ.12 కోట్లు మాయం.. బ్యాంకులకే చుక్కలు

రోజూ ఎక్క‌డో ఓచోట సైబ‌ర్‌ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా సైబ‌ర్ దాడులు మాత్రం ఆగ‌డం లేదు. హైదరాబాదులో తాజాగా మహేశ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌ చేసి రూ.12 కోట్లు కాజేశారు.
 
మహేశ్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ ప్రధాన సర్వర్ హ్యాక్ చేశారు మోసగాళ్లు. త‌ర్వాత రూ.12 కోట్లను కాజేశారు. ఆ సొమ్మును వంద బ్యాంకులకు బదిలీ చేశారు.
 
వెంట‌నే తేరుకున్న బ్యాంకు యాజ‌మాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్ర‌యించింది. జ‌రిగిందంతా వివ‌రించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.