గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (12:23 IST)

మహారాష్ట్రలో తెరుచుకున్న పాఠశాలలు

మహారాష్ట్రలో సుధీర్ఘకాలం తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనలను అనుసరించి పాఠశాలలో చదువులు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 
 
అయితే, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్స్‌కు పంపించేందుకు అనుమతించలేదు. ఇదే అంశంపై నిర్వహించిన ఓ సర్వేలో ఏకంగా 67 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలను స్కూల్స్‌కు పంపేందుకు ఇష్టపడటం లేదు. 
 
3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు 
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. వరుసగా ఐదో రోజు కూడా మూడు లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం ఈ కేసుల నమోదులో కాస్త తగ్గుముఖం కనిపించింది. ఆదివారం కంటే సోమవారం 27469 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ మేరకు ప్రస్తుతం దేశంలో 03,06,064  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో కొత్తగా 439 మంది మరణించారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,43,328కి చేరింది. ఇందులో 3,68,04,145 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 4,89,849 మంది ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.