గూగుల్‌లో ఉద్యోగం.. బెంగళూరు యువకుడికి రూ.60లక్షల జీతం
22 ఏళ్ల బెంగళూరు యువకుడు గూగుల్‌లో ఉద్యోగం కొట్టేశాడు. ఇతనికి రూ.60లక్షల భారీ మొత్తాన్ని జీతం కింద గూగుల్ ఇవ్వనుంది. వివరాల్లోకి వెళితే.. ఐఐటీ బెంగళూరులో చదివిన 22 ఏళ్ల యువకుడు కేబీ శ్యామ్.. సంవత్సరానికి రూ.60లక్షల సంపాదన కింద గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. గూగుల్, ఆపిల్, అమేజాన్, ఫేస్‌బుక్ వంటి సంస్థల్లో పనిచేయాలని చాలామంది కలలుకంటూ వుంటారు.
అయితే కొందరికి మాత్రమే ఆ కల నిజమవుతుంది. ఇలా శ్యామ్‌కు గూగుల్‌లో పనిచేసే బంపర్ ఆఫర్ వచ్చింది. బెంగళూరు ఐఐటీలో ఐదేళ్ల డిగ్రీని పూర్తి చేసిన శ్యామ్.. గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.
ఈ ఉద్యోగంలో భాగంగా పోలాండ్ గూగుల్ కార్యాలయంలో అక్టోబర్‌లో శ్యామ్ జాయిన్ కానున్నాడు. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన శ్యామ్.. గత ఏడాది ఫేస్‌బుక్ లండన్ ఆఫీసులో మే 2018 నుంచి ఆగస్టు 2018 వరకు పనిచేశాడు. ఇతడు ప్లస్‌టూలో 95.2 శాతం ఉత్తీర్ణత సాధించాడు.