గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (18:41 IST)

స్కార్పియో కారు బానెట్‌పై కూర్చొని పెళ్లి మండపానికి వధువు

Bride
సోషల్ మీడియా అంటే నేతి యువతకు మహా పిచ్చి. ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ప్రస్తుతం వారంతా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పెళ్లి విషయంలో మాత్రం యువత తమకు నచ్చిన విధంగా రకరకాలుగా కొత్త పద్ధతుల్లో చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఫొటోషూట్‌ అయితే చెప్పనక్కర్లేదు. ఫొటోషూట్‌ కోసం ఎక్కడికెక్కడికో వెళ్లి.. రిస్కు చేసైనా సరే రకరకాల పద్ధతుల్లో ఫొటోలు దిగుతున్నారు. 
 
అయితే, తాజాగా ఓ యువతి పెళ్లికి ముందు ఫొటో షూట్‌ను అందరిలా కాకుండా భిన్నంగా చేయాలని ప్రయత్నించింది. పుణెలోని పింపరీ చించ్‌వడ్‌కు చెందిన శుభంగి అనే యువతి ఏకంగా స్కార్పియో కారు బానెట్‌పై కూర్చొని పెళ్లి మండపం వరకూ వెళ్లింది. ముందు ఫొటోగ్రాఫర్‌ బైక్‌పై వెనక్కి తిరిగి కూర్చొని ఆమెను ఫొటోలు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే, కరోనా నిబంధనల కారణం చూపి వధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు.