Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 9 యాప్‌లు తొలగింపు.. ఏంటవి?

Written By ఠాగూర్
Updated: సోమవారం, 5 జులై 2021 (08:16 IST)
గూగుల్ ప్లే స్టోర్ నుంచి మరో 9 యాప్‌లను తొలగించారు. ఈ యాప్‌లు హానికరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, 9 యాప్‌లు యూజర్ల పాలిట ప్రమాదకారులని డాక్టర్ వెబ్ అనే మాల్వేర్ విశ్లేషణ సంస్థ వెల్లడించింది. అందుకే కొన్ని ఆండ్రాయిడ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.
 
నిజానికి ఇపుడు తొలగించిన యాప్‌లన్నీ గతంలో గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండేవని, అయితే వాటిపై ఫిర్యాదులు రావడంతో గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు కూడా తమ ఫోన్లలో ఈ 9 యాప్‌లలో ఏది ఉన్నా జాగ్రత్తపడాలని డాక్టర్ వెబ్ హెచ్చరించింది.
 
ఇవి ప్రధానంగా ట్రోజన్ వైరస్ తరహా యాప్‌లని, చూడ్డానికి సాధారణంగా కనిపించే కొన్ని లింకుల సాయంతో ప్రమాదకరమైన కొన్ని జావా స్క్రిప్టులను చొప్పించి, యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తాయని సదరు సంస్థ వెల్లడించింది. 
 
అనంతరం ఆ సమాచారాన్ని సదరు యాప్‌లు సైబర్ నేరగాళ్ల సర్వర్‌లకు చేరవేస్తాయని వివరించింది. అందుకే పీఐపీ ఫొటో (PIP Photo), ప్రాసెసింగ్ ఫొటో (Processing Photo), రబ్బిష్ క్లీనర్ (Rubbish Cleaner), హారోస్కోప్ డైలీ (Horoscope Daily), ఇన్ వెల్ ఫిట్ నెస్ (Inwell Fitness), యాప్ లాక్ కీప్ (App Lock Keep), లాక్ ఇట్ మాస్టర్ (Lockit Master), హారోస్కోప్ పై (Horoscope Pi), యాప్ లాక్ మేనేజర్ (App Lock Manager) అనే యాప్‌లను తొలగించినట్టు పేర్కంది. 

అన్నీ చూడండి

Chiranjeevi : జి.వి. నారాయణరావు అంత్యక్రియలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి

Toxic Torture reson: టాక్సిక్ చిత్రం టార్చెర్ కు కారణం ఏమిటి ? రుక్మిణి వసంత్ పాత్రపై చర్చ

Varanasi rumors: వారణాసి ని మరిచిపోకుండా వదంతులతో ప్రచారం చేస్తున్నారా ?

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments