శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (17:05 IST)

అమ్మో.. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ పని చేయకండి.. 7 యాప్స్..?

డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం అవాస్ట్ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న యాప్స్‌ని గుర్తించి లిస్ట్ బయటపెట్టింది. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి. 
 
ప్రతి నెల ఇలా వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా తమ వినియోగదారుల నుండి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించింది అవాస్ట్. అందుకే వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని, ఒక వేల డౌన్‌లోడ్‌ చేసుకుంటే వెంటనే వీటిని మొబైల్ నుండి తొలగించాలని పేర్కొంది. 
 
ప్లే స్టోర్‌లో ఉండే ఈ యాప్స్ వల్ల మన ఫోన్ హ్యాకర్ల బారిన పడే అవకాశాలున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ గుర్తిస్తూ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సంస్థలు వాటి పేర్లను బహిర్గతం చేస్తున్న సంగతి తెలిసిందే.