శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (09:11 IST)

ఫేస్ బుక్ సేవలు ఆగిపోయాయి... వినియోగదారులు అల్లాడిపోయారు..

అమెరికా, యూరప్ సహా భారత్‌లోనూ ఫేస్‌బుక్ సేవలు ఆగిపోయాయి. ఫేస్‌బుక్ లేకుండా క్షణం కూడా ఉండలేని వినియోగదారులు బుధవారం రాత్రి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఫే

అమెరికా, యూరప్ సహా భారత్‌లోనూ ఫేస్‌బుక్ సేవలు ఆగిపోయాయి. ఫేస్‌బుక్ లేకుండా క్షణం కూడా ఉండలేని వినియోగదారులు బుధవారం రాత్రి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. 
 
అమెరికా, మెక్సికో, మలేషియా, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతోపాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లోని వినియోగదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆయా ఖాతాలు ఓపెన్ చేసిన వారికి అంతరాయానికి చింతిస్తున్నామనే మెసేజ్ కనిపించింది. 
 
సేవలు నిలిచిపోవడంతో రంగంలోకి దిగిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నిపుణులు గంటలోనే సమస్యను పరిష్కరించారు. భారత్‌లో కొద్ది మంది వినియోగదారులకు ఈ సమస్య ఎదురైంది. ట్విట్టర్‌లో కొన్ని ట్వీట్లు ఆకట్టుకునేలాగా వాటిని భద్రపరుచుకునే సదుపాయం ట్విట్టర్లో లేదు. 
 
దీంతో స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇలా కాకుండా ఇష్ట‌మైన ట్వీట్‌ని బుక్‌మార్క్ చేసుకుని త‌ర్వాత చూసుకునే స‌దుపాయాన్ని ట్విట్ట‌ర్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల జరిగిన ట్విట్టర్ హ్యాక్ వీక్‌లో ఈ సమస్యను కొంతమంది వినియోగదారులు ప్రస్తావించారట. దీంతో `సేవ్ ఫ‌ర్ లేట‌ర్‌` బ‌ట‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ట్విట్ట‌ర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.