మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (09:06 IST)

భార్య నగ్న చిత్రాలు, వీడియోలను ఆమె తండ్రి, సోదరుడికి పంపాడు..

భార్య నగ్న చిత్రాలు, వీడియోలను ఆమె ఈ-మెయిల్, వాట్సాప్ నంబర్లకు పంపి వికృతానందం పొందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య పట్ల మూర్ఖంగా ప్రవర్తించిన భర్త చేష్టలను సహించలేకపోయిన భార్య కేసు పెట్టిం

భార్య నగ్న చిత్రాలు, వీడియోలను ఆమె ఈ-మెయిల్, వాట్సాప్ నంబర్లకు పంపి వికృతానందం పొందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య పట్ల మూర్ఖంగా ప్రవర్తించిన భర్త చేష్టలను సహించలేకపోయిన భార్య కేసు పెట్టింది. తనపై పెట్టిన కేసులను వాపసు తీసుకోకపోతే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. ఈ మేరకు నిందితుడు చిలకపాటి సునీల్ కుమార్‌ను ఒడిశాలో పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరం నివాసి చిలకపాటి సునీల్‌ కుమార్‌ ఒడిశాలోని ఐఓసీఎల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి శేరిలింగంపల్లికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజులు వీరి కాపురం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత సునీల్‌ ఆగడాలు శ్రుతిమించడంతో విశాఖపట్నంలోని ఒక ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. 
 
విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఆమెకు భృతి చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు సునీల్‌ ఎత్తు వేశాడు. నకిలీ ఈ-మెయిల్ ఖాతా తెరిచి తనతో భార్య ఏకాంతంగా గడిపిన చిత్రాలను ఆమె మెయిల్ ఐడీకి పంపాడు. బాధితురాలి సోదరుడు, తండ్రి వాట్సప్‌ నంబర్లకు షేర్‌ చేశాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాట్సాప్‌ నంబర్‌ ఆధారంగా నిందితుడు ఒడిశాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నాడు.