గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (16:08 IST)

సింగపూర్ సెలబ్రిటీ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ మృతి (Video)

సింగపూర్ సెలబ్రిటీ బాక్సింగ్ పోటీలో విషాదం చోటుచేసుకుంది. కిక్ బాక్సింగ్ బౌట్‌లో పాల్గొన్న భారత సంతతికి చెందిన ప్రదీప్ సుబ్రహ్మణ్యన్ గుండెపోటుతో మరణించాడు. పోటీ ముగిసిన కాసేపటికే ఆయన కుప్పకూలిపోయాడు.

సింగపూర్ సెలబ్రిటీ బాక్సింగ్ పోటీలో విషాదం చోటుచేసుకుంది. కిక్ బాక్సింగ్ బౌట్‌లో పాల్గొన్న భారత సంతతికి చెందిన ప్రదీప్ సుబ్రహ్మణ్యన్ గుండెపోటుతో మరణించాడు. పోటీ ముగిసిన కాసేపటికే ఆయన కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను హుటాహుటిగా ఆస్పత్రికి తీసుకువెళ్లినా అప్పటికే ప్రదీప్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. 
 
స్టీవెన్‌లిమ్‌తో జరిగిన పోటీలో ప్రదీప్‌కు తీవ్రగాయాలయ్యాయి. తలపై పంచ్‌లు పడ్డాయి. గేమ్ మొదలైన 5 నిమిషాలకే ప్రదీప్ ముక్కులో నుంచి రక్తంకారడంతో రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేశాడు. లిమ్‌ను విజేతగా ప్రకటించాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. ప్రదీప్ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని షాక్‌కు గురిచేసింది.