మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (18:55 IST)

''గూగుల్ పే ఆఫర్లు'' నమ్మారో.. ఇక మీ డబ్బు గోవిందా? లక్షలు మింగేశారు..!

నగదు బదిలీకి ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఆన్‌లైన్ పేమెంట్లు పెరిగిపోయాయి. మనీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన బోలెడు యాప్స్ వచ్చేశాయి. అందులో ఒకటే గూగుల్ వారి గూగుల్ పే. అయితే గూగుల్ పే ద్వారా ప్రస్తుతం ఓ సైబర్ మోసం చోటుచేసుకుంది. గూగుల్‌ పే ఆఫర్లు అంటూ ఫోన్‌ చేసి మరీ దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ, నోయిడాకు చెందిన సైబర్ నేరగాళ్లు గూగుల్ పే పండుగ పేరిట ఆఫర్ పెట్టారు. ఇందులో రూపాయి జమచేస్తే రెండు రూపాయిలు మీ వ్యాలెట్ లోకి వస్తాయంటూ ఫోన్లు చేస్తూ కస్టమర్లు మోసం చేస్తున్నారు. ఈ ఆఫర్‌ను నమ్మి చాలామంది డబ్బు జమ చేయడం ప్రారంభించారు. ఇలాంటి ప్రకటన హైదరాబాదుకు చెందిన ఓ మహిళకు వచ్చింది. 
 
ఈ ఆఫర్‌ కోసం ఆమె ముందుగా పది రూపాయలు జమ చేసింది. వెంటనే ఆమె వ్యాలెట్‌కు 20 రూపాయలు వచ్చి చేరాయి. దీన్ని నమ్మిన సదరు మహిళ ఏకంగా లక్ష రూపాయల పదివేలను జమ చేసింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆ డబ్బు మాత్రం తిరిగి రాలేదు. ఇక ప్రకటన ఇచ్చిన నెంబర్‌కు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. 
 
అంతే మోసపోయానని గుర్తించిన ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాదులోనే పది లక్షల వరకు నేరగాళ్లు కొట్టేసినట్లు కనుగొన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా రూ.35లక్షల వరకు సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు తెలుస్తోంది.