మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (13:42 IST)

మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి బిల్డింగ్ పై నుంచి తోసి చంపిన ప్రియుడు

హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ప్రియురాలిని నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి కిందకు నెట్టాడు ఓ ప్రియుడు. ఆమెను చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రియురాలు మృతి చెందింది. ప్రియుడు దిలీప్ మాత్రం పరారయ్యాడు.
 
బ్రతుకుదెరువు కోసం 15 రోజుల క్రితం మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చిన వీరు ఇరువురు వనస్థలిపురం శక్తినగర్ లోని వాసవి నిలయం భవనం నిర్మాణాల పనిలో చేరారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తోటి పనివారితో చెపుతూ ఉండేవారు. 
 
మరి ఇంతలో ఏమయిందో ఏమో నిర్మాణంలో ఉన్న వాసవీ నిలయం అపార్టుమెంట్ 3వ అంతస్తుపై నుంచి కిందకు ప్రియురాలు సీమను కొట్టి నెట్టేశాడు దిలీప్. అయితే అసలు ఆమెను ఎందుకు చంపాలనుకున్నాడు అనే విషయం మాత్రం అంతుపట్టకుండా ఉంది. దిలీప్ పోలీసులకు  దొరికితే తప్ప ఈ విషయం తెలీదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడి కోసం గాలిస్తున్నారు.