Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

చైనాకు షాకిచ్చిన గూగుల్-2,500 యూట్యూబ్ ఛానల్స్‌ తొలగింపు

Written By సెల్వి
Updated: శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:06 IST)
చైనాకు గూగుల్ కూడా షాకిచ్చింది. ఇప్పటికే భారత్-అమెరికా దేశాలు చైనా యాప్‌లపై కొరడా ఝుళిపిస్తున్న తరుణంలో చైనాకు గూగుల్ షాకిచ్చింది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్‌‌పై ఫేక్ ఇన్ఫర్మేషన్ తొలగించేందుకు సిద్ధమైన గూగుల్ యూట్యూబ్ చానెల్స్‌పై దృష్టి సారించింది. చైనాతో లింక్ ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించినట్లు సెర్చింజన్ గూగుల్ తెలిపింది. 
 
వీటిని ఏప్రిల్ - జూన్ మధ్య తొలగించినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం గతంలో చైనాకు చెందిన కొన్ని యాప్స్‌ను నిషేధించింది. ఇదే దారిలో మరికొన్ని దేశాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అన్నింటిని సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా వీటి తొలగింపు చోటు చేసుకుంది.
 
అయితే కరోనా తర్వాత చైనా యాప్స్, యూట్యూబ్ లింక్స్ తొలగింపు చర్చనీయాంశంగా మారింది. తప్పుడు సమాచారం కారణంగా వీటిని తొలగించినట్లు తెలిపింది. దీనిపై స్పందించాలని కోరగా అమెరికాలోని చైనీస్ రాయబార కార్యాలయం వెంటనే రెస్పాండ్ కాలేదని సమాచారం.

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments