భారత మార్కెట్లోకి ఐకూ 11 స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే
భారత మార్కెట్లోకి ఐకూ 11 స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అన్నీ రకాల ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. 16జీబీ వేరియంట్ ధర రూ.64,999. అమేజాన్‌లో జనవరి 12 నుంచి విక్రయాలు ఆరంభమవుతాయి.
ప్రైమ్ యూజర్లు అదే రోజు కొనుగోలు చేసుకోవచ్చు. నాన్ ప్రైమ్ యూజర్లకు 13 నుంచి కొనుగోలుకు అవకాశం ఉంటుంది. గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్ మరింత మెరుగైన అనుభవాన్నిఇస్తుంది.
ఫీచర్స్ సంగతికి వస్తే...
ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యమవుతాయి.
6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే,
144 హెర్జ్ రీఫ్రెష్ రేటు,
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 2 చిప్ సెట్,
ఆండ్రాయిడ్ 13, వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ శామ్ సంగ్ జీఎన్5 లెన్స్,
అలాగే 13 మెగాపిక్సల్ టెలీఫొటో లెన్స్, 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి.
ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.
5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో రీచార్జ్ చేసుకోవచ్చు.