సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (13:53 IST)

కరోనా కష్టకాలంలో జియో గుడ్ న్యూస్: 300 నిమిషాల పాటు...?

ఈ కరోనా కష్టకాలంలో రీఛార్జ్ చేసుకోలేకపోతున్న జియో ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. జియో ఫోన్స్‌తో తక్కువ ధరకు పేదలకు ఫోన్‌తో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కరోనా కష్టకాలంలో జియో ఫోన్ వినియోగదారులకు కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చి మంచి మనస్సు చాటింది. 
 
ఎలాంటి రీఛార్జ్ చేయించకున్నా నిత్యం పది నిమిషాలు అంటే నెలకు 300 నిమిషాల పాటు ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది జియో. ఈ ఆఫర్ ఈ కరోనా విపత్తు ముగిసే వారకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది సంస్థ.
 
ఉదాహరణకు జియో ఫోన్ వినియోగదారులు రూ. 75 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. మరో రూ.75 ప్లాన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ప్రతీ భారతీయుడికి సాయం అందించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని జియో స్పష్టం చేసింది.