Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలు ప్రారంభం

Written By ఐవీఆర్
Updated: గురువారం, 16 జూన్ 2022 (18:27 IST)
దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్ బాండ్‌గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని మరింత పటిష్ఠం చేసుకుంది. వేగవంతమైన విస్తరణలో భాగంగా జియో ఫైబర్ ఇప్పుడు తన సేవలను పిఠాపురం పట్టణంలో ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జియో ఫైబర్ 45 పట్టణాల్లో విస్తరించి తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

 
విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్యమైన నగరాలు మాత్రమే గాకుండా, అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, వుయ్యూరులలో కూడా జియో ఫైబర్ లభ్యమవుతుంది.

 
జియోఫైబర్ వేగంగా విస్తరించడం విద్యారంగంలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతగానో తో డ్పడింది. విశ్వసించదగిన, తిరుగులేని హైస్పీడ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్‌తో వారికి ఎంతో ప్రయోజనం కలిగించింది. ఎంతోమంది వృత్తినిపుణులు మరీ ముఖ్యంగా ఐటీ, ఇతర సేవా రంగాలకు చెందినవారు రాష్ట్రంలోని తమ స్వస్థలాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఎంతో సజావుగా తమ పనులు చేసుకోగలుగుతున్నారు. ఈ పట్టణాల్లోని ఎన్నో చిన్న సంస్థలు, విద్యాసంస్థలు తమ వ్యాపారాలు, వృత్తుల డిమాండ్లకు అనుగుణంగా డిజిటల్ విధానం లోకి మారిపోగలిగాయి. 

 
నూతన పోస్ట్-పెయిడ్ ప్లాన్ యూజర్లకు జియో ఫైబర్ ఇప్పుడు ఎలాంటి ప్రవేశరుసుము లేకుండానే లభిస్తుంది. యూజర్లు గనుక జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్‌ను ఎంచుకుంటే, రూ.10,000 విలువ కలిగిన ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వే రూటర్), సెట్ టాప్ బాక్స్, ఇన్‌స్టాలేషన్లను ఉచితంగానే పొందగలుగుతారు. మరో సంచలనాత్మక ఆఫర్ జియో ఫైబర్ ఎంటర్ టెయిన్ మెంట్ బొనాంజా. ఇది అదనంగా చెల్లించే రూ. 100తోనే అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.399ల ప్రారంభధరతో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్ కు యాక్సెస్ పొందవచ్చు. నెలకు రూ.100 లేదా రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా వారు 14 ప్రముఖ ఓటీటీ యాప్స్ కలెక్షన్ నుంచి తమకు నచ్చిన కంటెంట్‌ను చూడవచ్చు.

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments