గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (08:55 IST)

రూ.16వేలకే వన్‌ప్లస్ 9 5జీ స్మార్ట్ ఫోన్‌.. అమేజాన్‌లో భారీ ఆఫర్

OnePlus 9 Pro 5G
OnePlus 9 Pro 5G
వన్‌ప్లస్ 9 5జీ స్మార్ట్ ఫోన్‌ ధర రూ.16వేలకే లభించనుంది. ఈ ఫోనుపై అమెజాన్‌లో భారీ ఆఫర్ అందించారు. వన్‌ప్లస్ 9 5జీలో ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
 
ఈ ఫోన్ అసలు ధర రూ.49,999 కాగా... రూ.37,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కూడా రూ.42,999కు తగ్గింది. 
 
అయితే ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే మీ స్మార్ట్ ఫోన్‌ను బట్టి అదనంగా మరో రూ.21,500 వరకు తగ్గింపు లభించనుంది. అంటే రూ.16,099కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
 
వన్ ప్లస్ 9 5జీ స్పెసిఫికేషన్లు
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ 
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 9 పనిచేయనుంది. 
6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే. 
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 
3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. 
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.
 
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్689 సెన్సార్‌ను వన్‌ప్లస్ అందించింది. 
 
ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రీఫాం లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా అందించారు. 
 
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరాను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది.