శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మే 2022 (19:23 IST)

జూన్ 3 నుండి ఓటీటీలోకి కె.జి.ఎఫ్: చాప్టర్ 2

Yash
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కేజీఎఫ్‌కు తరువాయిగా కె.జి.ఎఫ్: చాప్టర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది.

జూన్ మూడో తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. అమేజాన్ ప్రైమ్‌లో కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.  
 
జూన్ 3 నుండి ప్రారంభించి, ప్రైమ్ వీడియో ద్వారా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఇదే సర్వీస్‌పై ఈ చిత్రాన్ని చూడవచ్చు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో రాకీ భాయ్ ఆధిపత్యాన్ని ఈ చిత్రం చూపెడుతుంది.

రాఖీని మిత్రులు గౌరవించి ఆరాధిస్తే, ప్రభుత్వము అతనిని శాంతి భద్రతలకు ఒక అపాయముగా పరిగణిస్తుంది. తన తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ, అధీర, ఇనాయత్ ఖలీల్, రామిక సేన్ రూపములో వచ్చే అవరోధాలను ఎదుర్కొంటూ రాఖీ చేసిన సాహసాలే ఈ సినిమా. 
 
యష్ నటించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావ్, అచ్యుత్ కుమార్, అర్చనా జోయిస్‌లు ఇతర కీలక పాత్రలలో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ కే.జి.ఎఫ్: చాప్టర్ 2 చలన చిత్రాన్నిహొంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించారు.