శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (17:25 IST)

ప్రైమ్ వీడియోలో కీర్తి సురేశ్‌, సెల్వరాఘవన్ చిత్రం

Keerthi Suresh
Keerthi Suresh
అరుణ్ మాథేశ్వరన్  దర్శకత్వంలో రూపొందిన ప్రతీకారం, యాక్షన్-డ్రామా సాని కాయిదం చిత్ర ప్రపంచవ్యాప్త విడుదల తేదీని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నేడు ప్రకటించింది. స్క్రీన్ సీన్ మీడియా బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. పొన్ని (కీర్తి సురేష్ పోషించిన పాత్ర) ఆమె కుటుంబానికి తరతరాలుగా వస్తున్న శాపం నిజమవుతూ ఉంటుంది. టీజర్ ప్రోమోలో చూసినట్లుగా ఆమె చేదు గతాన్ని పంచుకున్న సంగయ్య (సెల్వరాఘవన్ పోషించిన)తో కలిసి ప్రతీకారం తీర్చుకుంటుంది. 
 
తమిళ చిత్రం May 6 నుంచి ప్రైమ్ వీడియో ద్వారా  ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతుంది. తెలుగులో చిన్నిగా, మలయాళంలో సాని కాయిదంగా కూడా దీనిని వీక్షించవచ్చు.
 
“సాంప్రదాయ కథలను సంప్రదాయేతర విధానంలో చెప్పడం, మొరటు, పదునైన అంశాలు తీసుకురావడం నాకు చాలా ఇష్టం. ప్రతీకార నేపథ్యం చుట్టూ అల్లిన క్లిష్టమైన యాక్షన్ చిత్రం ఇది. ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఒక మహిళకు సంబంధించిన కథ ఇది'' అని దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ అన్నారు.  
 
“సాని కాయిదమ్ ఆకట్టుకునే కథే కాదు, మనస్సులను కదిలిస్తుంది కూడా. న్యాయం కోసం పోరాడుతున్న ఒక మహిళ శక్తిని చూపడంలో అరుణ్‌ మాతేశ్వరన్‌ అద్భుతంగా వ్యవహరించారు. కీర్తి సురేష్, సెల్వరాఘవన్ ఇద్దరూ ఈ చిత్రంతో తన చక్కని నటనతో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అందించారు.  అది కథను మరింత ఆకట్టుకునేలా చేస్తుంది” అని చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రావిపాటి అన్నారు.