ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (15:22 IST)

ఎంఐ బంపర్ ఆఫర్... స్మార్ట్‌ఫోన్ల‌ ఎక్స్ఛేంజ్

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారతదేశంలో తమ మొబైల్ మార్కెట్‌ను మరింతగా పెంచుకునేందుకు దృష్టిసారించింది. ఇందులోభాగంగా, భారత మొబైల్ యూజర్లకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారతదేశంలో తమ మొబైల్ మార్కెట్‌ను మరింతగా పెంచుకునేందుకు దృష్టిసారించింది. ఇందులోభాగంగా, భారత మొబైల్ యూజర్లకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలో ఎక్స్ఛేంజ్ ద్వారా ఎంఐ స్మార్ట్‌ఫోన్ల‌ను సొంతం చేసుకునే సదుపాయాన్ని తొలిసారి కల్పించింది.
 
ఇందుకోసం న్యూఢిల్లీకి చెందిన క్యాషిఫై అనే సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సౌక‌ర్యం ద్వారా భార‌త వినియోగ‌దారులు త‌మ పాత ఫోన్ల‌ను ఎంఐ స్టోర్‌లో ఇచ్చేసి, కొత్త ఎంఐ స్మార్ట్‌ఫోన్ పొంద‌వ‌చ్చు. అయితే పాత ఫోన్ల‌కు ఎంత ధ‌ర నిర్ణ‌యించాల‌నే హ‌క్కును షియోమి, క్యాషిఫై సంస్థ‌కు అప్ప‌గించింది.
 
వారు నిర్ణ‌యించిన ధ‌ర‌కు అనుగుణంగా, కొత్త ఎంఐ ఫోన్ ధ‌ర‌లో డిస్కౌంట్ ఇస్తారు. మీ పాత మొబైల్ విలువ ఎంత ఉంటుందో క్యాషిఫై యాప్ ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు. క్యాషిఫై వారి ఎక్స్చేంజ్ ధ‌ర న‌చ్చిన వారు త‌మ మొబైల్ ఫోన్‌ను ఇచ్చేసి, కొత్తగా ఎంఐ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.