30 రోజుల కాలపరిమితితో కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో - ఎయిర్‌టెల్
టెలికాం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆదేశం మేరకు దేశంలోని టెలికాం సంస్థలు 30 రోజుల కాల వ్యవధితో కూడిన ప్లాన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా ఈ తరహా ప్లాన్స్‌ను తన వినియోగదారులకు అందచేసింది. ఇపుడు ఇదే బాటలో జియో, ఎయిర్‌టెల్ సంస్థలు నడువనున్నాయి. ఇందుకోసం ఈ రెండు సంస్థలు కలిసి నాలుగు ప్లాన్స్‌ను ప్రవేశపెట్టాయి.
రిలయన్స్ జియో రూ.256 ప్లాన్
నెలకు ఒకసారి ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఏప్రిల్ 6వ తేదీన రీచార్జ్ చేసుకున్నట్టయితే మే 5వ తేదీన ఈ ప్లాన్ రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీవీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమతి వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటు వుంది.
జియో రూ.296 ప్లాన్
ఈ ప్యాక్‌లో రోజువారీగా 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత వాయిస్ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. అలాగే, రోజువారీగా 2 జీబీ డేటా ఇస్తుంది. 30 రోజుల కాలపరిమితి.
ఎయిర్‌టెల్ రూ.319
ఈ ప్లాన్ కాలపరిమితి 30 రోజులు. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, రోజువారీగా 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.296
ఇది కూడా 30 రోజుల కాల వ్యవధితో పనిచేస్తుంది. ఇందులో 25 జీబీ డేటాతో పాటు ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు.