శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:50 IST)

దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్‌టెల్ సేవలు

దేశంలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటిగా ఉన్న ఎయిర్‌టెల్ మొబైల్ సేవలకు ఇటీవలి కాలంలో తరచుగా అంతరాయం ఏర్పడతుంది. ఈ నెల ప్రారంభంలో ఈ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. తాజాగా శుక్రవారం కూడా ఈ సేవలు నిలిచిపోయాయి. ఉదయం 11.30 గంట నుంచి ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్, వైఫై, మొబైల్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 
 
అలాగే, ఎయిర్‌టెల్ యాప్ కూడా పనిచేయడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు, తమ సేవల అంతరాయంపై ఎయిర్‌టెల్ కంపెనీ స్పందించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి క్షమాపణలు కూడా చెబుతున్నట్టు పేర్కొంది. సేవలను వీలైనత త్వరగా పునరుద్ధరించే దిశగా చర్యలు సాగుతున్నట్టు పేర్కొంది.