గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (15:28 IST)

రిలయన్స్ జియోకు షాకిచ్చిన యూజర్లు... 1.9 కోట్ల మంది ఔట్

దేశంలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న రిలయన్స్ జియోకు వినియోగదారులు తేరుకోలేని షాకిచ్చింది. గత సెప్టెంబరు నెలలో ఆ కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఏకంగా 1.9 కోట్ల మంది యూజర్లు ఆ కంపెనీని వీడిపోయారు. 
 
అలాగే, వొడాఫోన్ కూడా జియో దారిలోని పయనిస్తుంది. ఈ కంపెనీ నుంచి 10.8 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. అయితే, ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలను వదిలి వెళ్లిన యూజర్ల సంఖ్యతో పోల్చుకుంటే రిలయన్స్ జియోనే అధిక సంఖ్యలో యూజర్లను కోల్పోయింది. 
 
ఇలా జియోను వదలివెళ్లిన వారిలో మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ 2.74 లక్షల మంది యూజర్లను కైవసం చేసుకుంది. అదేసమయంలో ఎయిర్‌టెల్ తాజాగా కస్టమర్లకు తేరుకులోని షాకిచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి ప్రీపెయిడ్ రేట్లను 25 శాతం మేరకు పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.