''నోకియా డేస్'' ఫ్లిఫ్‌కార్ట్ సూపర్ సేల్..
ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిఫ్‌కార్ట్ ''నోకియా డేస్'' పేరిట సేల్‌ని నిర్వహిస్తోంది. ఈ మేరకు నోకియా బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ఫ్లిఫ్‌కార్ట్ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.14,999 ధరకి లభించనుంది.
అలాగే నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.9,999 ధరకి లభించనుంది. ఆకట్టుకునే ఫీచర్లను కలిగివున్న ఈ ఫోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వుంది. నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్లపై రూ.1000 డిస్కౌంట్‌తో పాటు అదనంగా యాక్సిస్ బ్యాంకు కార్డులపై ఐదు శాతం డిస్కౌంట్లను పొందవచ్చును.
నోకియా 5.1, 6.1 మొబైల్ ఫోన్లపై ఈఎంఐ ఆప్షన్ కూడా వుంది. ఈ ఫోన్లకు ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్‌ను కూడా ఇచ్చింది. రూ.1,800ల క్యాష్ బ్యాక్‌తో పాటు 240 జీబీ డేటా ఆదాయాన్ని కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది.