శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (14:34 IST)

వామ్మో.. ఐదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ..

నోకియా నుంచి సరికొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు కెమెరాలతో కూడిన ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ విడుదల చేయనుంది. వెనుకవైపు ఐదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ పేరిట ఈ ఫోన్ జనవరి నెలాఖరున విడుదలయ్యే అవకాశం వుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. 
 
ఇంకా 5.9 హెచ్డీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో వున్నాయి. పెంటా లెన్స్ కెమెరా సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. లేటెస్టు స్నాప్ డ్రాగన్ 855 చిప్ సెట్‌ను ఇది కలిగివుంటుంది. 6జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగివుంటుంది.