Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మార్కెట్‌లోకి రానున్న వన్‌ప్లస్ 9ఆర్‌టీ

Written By సెల్వి
Updated: గురువారం, 7 అక్టోబరు 2021 (13:50 IST)
OnePlus 9 RT
భారత్ మార్కెట్‌లో త్వరలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 9ఆర్‌టీ లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 9ఆర్‌టీ ధర రూ 25,000 ఉంటుందని అంచనా. అక్టోబర్ 15న వన్‌ప్లస్ 9ఆర్‌టీ గ్లోబల్ లాంఛ్ ఉంటుందని చెబుతున్నారు. 
 
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ 23,000 నుంచి టాప్ మోడల్ ధర రూ 35,000 వరకూ ఉండవచ్చని టెక్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మూడు కలర్ ఆప్షన్స్‌లో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 9ఆర్‌ను పోలిన డిజైన్‌తోనే కస్టమర్ల ముందుకు వస్తుందని అంచనా.
 
ఇక 6.55 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ పవర్ వంటి ఫీచర్లతో ఆకట్టుకోనుంది. 5జీ సపోర్ట్‌, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్‌లో సందడి చేయనుంది
 
ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్‌తో కూడిన 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, ప్రైమరీ లెన్స్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్‌766 సెన్సర్‌, 16మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సర్ వంటి ఫీచర్లు అలరించనున్నాయి.

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments