శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (14:36 IST)

పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు... 34 లక్షల డేటా లీక్?

paytm mall
పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు. దీంతో 34 లక్షల డేటా లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పేటీఎం యాజమాన్యం మాత్రం ఈ వార్తలను ఖండిస్తుంది. 
 
పేటీఎం సంస్థకు చెందిన ఈ కామర్స్ ఫ్లాట్పాం పేటీఎం మాల్‌కు చెందిన వినియోగదారుల విలువైన డేటా లీకైనట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 2020లో పేటీఎం మాల్‌ హ్యాకింగ్‌కు గురైన సమయంలోనే ఈ డేటా లీకైనట్టు సమాచారం. 
 
దీంతో 34 లక్షల మంది మొబైల్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్టు సమాచారం. తమ డేటా లీక్ అయిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఫైర్ ఫాక్స్ మానిటర్‌ ఓ లింక్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. 
 
మరోవైపు, ఈ డేటా లీకైనట్టు వచ్చిన వార్తలను మాల్ గతంలోనూ, ఇపుడు కూడా ఖండించింది. ''మా యూజర్ల డేటా పూర్తి సురక్షితంగా ఉంది. 2020లో డేటా లీక్ అయినట్టు వస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పు. అసంబద్ధమైనవి" అంటూ పేర్కొంది.