శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (15:33 IST)

ట్రూలి అన్ లిమిటెడ్ అంటూ.. జియో ఫైబర్ నుంచి కొత్త ప్లాన్స్

ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతోంది. లాక్‌డౌన్‌లో వ్యాపారపరంగా అన్ని సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జియో మాత్రం లాభాల పంట పండిస్తూ తమ షేర్‌లను భారీగా విక్రయిస్తుంది. విదేశీ ప్రముఖ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నాయి. ఫేస్‌బుక్ కూడా ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. 
 
 
తాజాగా జియో ఫైబర్ కొత్త ప్లాన్స్‌ని లాంచ్ చేసింది. జియో ఫైబర్ కొత్త 'ట్రూలి అన్ లిమిటెడ్' అంటూ ప్లాన్స్ విడుదల చేసింది. రూ. 399-30 ఎంబిపిఎస్, రూ. 699 - 100ఎంబిపిఎస్, రూ. 999 - 150ఎంబిపిఎస్, రూ.1,499 - 300 ఎంబీపీఎస్అని ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వస్తున్నాయని పేర్కొంది.