శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (21:23 IST)

రిలయన్స్ జియో సూపర్ ఆఫర్.. రూ. 1,999లతో 5 నెలల పాటు ఉచిత డేటా ప్లాన్

JioFi 4G wireless hotspot
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. భారీ సంఖ్యలో కస్టమర్లను సంపాదించుకుంది. ఆపై పలు ప్రీ-పెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆఫర్లతో జియో కస్టమర్లను ఆకర్షిస్తోంది. తాజాగా కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న యూజర్ల కోసం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
ఇండిపెండెంన్స్ డే ఆఫర్‌లో భాగంగా జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలలపాటు ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ అందివ్వనున్నట్టు జియో ప్రకటించింది. జియోఫై ధర రూ. 1,999 మాత్రమే. అయితే ఈ ఆఫర్‌ను పొందేందుకు వినియోగదారులు తొలుత జియోపై కోసం ఇప్పటికే ఉన్న ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు చేయాలి. 
 
రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేసి జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సిమ్ యాక్టివేట్ అయిన గంట తర్వాత ప్లాన్ అమల్లోకి వస్తుంది.
 
మై జియో యాప్ ద్వారా యాక్టివేషన్ స్టేటస్‌ తెలుస్తుంది. అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో రూ.199 అత్యంత చౌకైన ప్లాన్. మరొకటి రూ.240 ప్లాన్. ఈ రెండో ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇది రూ. 349తో అందుబాటులో ఉన్న మూడో ప్లాన్‌లో 28 రోజులపాటు రోజుకు 3జీబీ డేటా లభిస్తుందని జియో ప్రకటించింది.