శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జులై 2020 (22:49 IST)

శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్ ఫోన్ తగ్గిందోచ్.. ఎంతో తెలుసా?

Samsung Galaxy A21s
శాంసంగ్ ఫోన్లపై ధర తగ్గించింది. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. అయితే ఇది కేవలం 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై మాత్రమే. దీని 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మాత్రం అలాగే ఉంది.
 
ఈ తగ్గింపు ధరతో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.18,499గా ఉంది. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర మాత్రం రూ.16,499గానే ఉంది. ఇందులో బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 
 
శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్పెసిఫికేషన్లు:
ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ+ సూపర్ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టా కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు. ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 
 
ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.  దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ గా ఉంది. 15డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాంక్ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఈ ఫోన్ బరువు 192 గ్రాములుగా ఉంది.
 
ఇంకా..
* వెనకవైపు నాలుగు కెమెరాలు 
* సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా.
* ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్
* 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 
* 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 
* 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్.