Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీసీఎస్ Work From Home Model.. 25X25 హైబ్రిడ్ మోడల్‌కు మారిపోతుందట!

Written By సెల్వి
Updated: గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:14 IST)
కరోనా నేపథ్యంలో పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌.. తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు పిలిపించాలని నిర్ణయించింది. కానీ టీసీఎస్ 25X25 హైబ్రిడ్ మోడల్‌కు మారేందుకు గతంలోనే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ మోడల్‌ను దశల వారీగా అమలు చేస్తూ రానున్న నాలుగేళ్లలో లక్ష్యాలు చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపిస్తోంది.
 
ఏమిటీ కొత్త మోడల్?
25X25 మోడల్ ప్రకారం.. 2025 నాటికి టీసీఎస్ ఉద్యోగుల్లో 25 శాతం మంది మాత్రమే కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అంటే చాలా తక్కువ మంది ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ మోడల్ ప్రకారం ఉద్యోగి తమ వర్కింగ్ టైమ్‌లో 25% మాత్రమే ఆఫీసులో గడుపుతారు. ఈ విధానంతో ప్రసవమైన ఉద్యోగినులు, వృద్ధులను చూసుకునే మహిళలు లబ్ధి పొందవచ్చని సంస్థ తెలిపింది.
 
ఈ మోడల్‌ గురించి టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపినాథన్ మాట్లాడుతూ.. '2025 నాటికి కంపెనీ ఉద్యోగుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే కార్యాలయాల నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త 25×25 విజన్‌ ప్రకారం మా కంపెనీ 2025 నాటికి 1.12 లక్షల మంది ఉద్యోగులను మాత్రమే కార్యాలయాల నుంచి పని చేయించాలని భావిస్తోంది' అని వివరించారు. ఈ నిర్ణయంతో ఉద్యోగుల శ్రేయస్సు, కంపెనీ ప్రొడక్టివిటీ మెరుగుపడతాయని గోపీనాథన్ వెల్లడించారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments