Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మోసాల గుర్తింపు, కమ్యూనిటీ ఇంటెలిజెన్స్ కలిపి అందిస్తున్న ట్రూకాలర్ స్కామ్ చెక్కర్

Updated: సోమవారం, 28 సెప్టెంబరు 2026 (19:08 IST)
బెంగళూరు: ట్రూకాలర్ ఈరోజు వెబ్, యాప్ పై ట్రూకాలర్ స్కామ్ చెక్కర్ ప్రారంభాన్ని ప్రకటించింది. ఇది ప్రజలు వారు ఒక స్కామ్ బారిన పడ్డారా అని వేగంగా అంచనావేయుటకు, తాజా మోసాల ధోరణుల గురించి అవగాహన కలిగి ఉండుటకు సహాయపడేందుకు రూపొందించబడిన ఒక కొత్త గమ్యస్థానము. కాలర్ గుర్తింపు, స్పామ్ బ్లాకింగ్ ను దాటి ట్రూకాలర్ యొక్క స్కామ్ రక్షణను అందించడం దీని ఉద్దేశము.
 
ఈ పరిష్కారము అనేక స్కామ్-తనిఖీ సామర్థ్యాలను ఒకే అనుభవములోకి తీసుకొస్తుంది. యూజర్లు ఒక చర్య తీసుకునే ముందే అనుమానాస్పద వెబ్ లింక్స్‌ను పరీక్షించుటకు, ఫోన్ నంబర్లు సెర్చ్ చేయుటకు, సంబంధిత స్కామ్ నివేదికలను కనుగొనుటకు, సంభావ్య మోసపూరిత ప్రయత్నాల గురించి అర్థంచేసుకొనుటకు సహాయపడుతుంది.
 
ట్రూకాలర్ స్కామ్ చెక్కర్‌తో ప్రజలు:
ద్రోహచింతన కలిగిన లేదా ఫిష్షింగ్ ప్రయత్నములో ఉపయోగించబడే చిహ్నాలు కొరకు ఒక లింక్‌ను పరీక్షించగలరు.
ట్రూకాలర్ యొక్క తనిఖీ వ్యవస్థలు, కమ్యూనిటి సంకేతాలు దేనిని సూచిస్తున్నాయి అని ఒక ఫోన్ నంబరును వెతకవచ్చు.
ఇతరులు వివరించిన ఇలాంటి స్కామ్స్ గురించి తెలుసుకొనుటకు స్కామ్‎ఫీడ్ నివేదికలను సెర్చ్ చేయగలరు.
తమ సొంత మాటలలో ఒక ఆందోళన గురించి వివరించవచ్చు. విచారణలో ఉన్న లింక్స్ లేదా నంబర్లపై ఉన్న చెక్స్ సహా సంబంధిత ఫలితాలను మరియు సంబంధిత కమ్యూనిటి నివేదికలను పొందవచ్చు.
 
అన్నీ కలిసి ఇవి ఒక అనుమానాస్పద సందేశములో సాధారణంగా ఉండే మూడు అంశాలను కవర్ చేస్తాయి: ఒక నంబర్, లింక్ మరియు ఒక కథనము. ఒక వ్యక్తి ఈ మూడింటి గురించి ఒకే చోట క్షణాలలో పరీక్షించుకోవచ్చు. ఈ ట్రూకాలర్ స్కామ్ చెక్కర్‌ను సమీప భవిష్యత్తులో స్కామ్ వ్యూహాలు, మరిన్ని విశ్లేషణల కోసం స్క్రీన్‎షాట్ అప్లోడ్స్, యూజర్ ప్రామాణీకరణ మరియు అదనపు సామర్థ్యాల కవరేజ్‌తో విస్తరించాలని కంపెనీ ఆలోచిస్తోంది.
 
“ఏదో తప్పుగా ఉంది అని ప్రజలు తరచూ అనుకుంటారు కాని స్పందించే ముందు పరీక్షించుకొనుటకు వారికి ఒక త్వరితమైన విధానము అవసరం ఉంటుంది,” అని రిషిత్ ఝున్‎ఝున్‎వాలా, సీఈఓ, ట్రూకాలర్ అన్నారు. “స్కామ్ చెక్కర్ మా తనిఖీ సామర్థ్యాలను, మా కమ్యూనిటి ఏమి ఫిర్యాదు చేసింది అనేవాటిని ఒకచోటికి తెస్తుంది, తద్వారా ప్రజలు ఒక అనుమానాస్పద లింక్, ఒక నంబరు లేదా కథనాల గురించి ఒకేచోట దర్యాప్తు చేయగలరు.”
 
అందుబాటు
భారతదేశములో ట్రూకాలర్ స్కామ్ చెక్కర్ ఆండ్రాయిడ్ యాప్ పై ప్రారంభించబడుతుంది. మరిన్ని ప్రాంతాలకు విస్తరించబడుతుంది. ట్రూకాలర్ వెబ్సైట్ పై ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. అదనపు మార్కెట్లలో అందుబాటు మరియు iOS సపోర్ట్ లు తరువాత ప్రణాళిక చేయబడతాయి. 
About Author
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... Read More

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments