Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఐడీఏఐ నిషేధం... కాళ్లావేళ్లా పడుతున్న ఎయిర్‌టెల్

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్‌పై ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) కొరఢా ఝుళిపించింది.

Written By pnr
Updated: మంగళవారం, 19 డిశెంబరు 2017 (10:38 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్‌పై ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) కొరఢా ఝుళిపించింది. ఇందులోభాగంగా, పలు ఎయిర్‌టెల్ సేవలను రద్దు చేసింది. వీటిలో ప్రధానమైనది ఎయిర్‌ పేమెంట్స్ బ్యాంక్ ఒకటి. అలాగే, మొబైల్ నంబరుకు, ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ. దీంతో దిగివచ్చిన ఎయిర్‌టెల్ కాళ్లావేళ్లా పడుతోంది. 
 
అర్హులైన లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ రాయితీని ఎయిర్‌టెల్ అక్రమంగా నొక్కేసింది. ఆధార్ కార్డు అనుసంధానం చేసిన అనేక మంది లబ్ధిదారులకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇలా రూ.190 కోట్లను ఎయిర్‌టెల్ పేమెంట్స్‌బ్యాంక్‌ ఖాతాల్లోకి చేరింది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 
 
దీంతో రంగంలోకి దిగిన యుఐడీఏఐ లోతుగా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఏకంగా 31 లక్షల మంది ఎయిర్‌టెల్‌ మొబైల్‌ వినియోగదారులకు చెందిన ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌బ్యాంక్‌ ఖాతాల్లో గ్యాస్‌ రాయితీ నగదు జమైనట్టు తేల్చింది. 
 
ఇపుడు ఈ మొత్తానికి వడ్డీతో కలిపి గ్యాస్‌ సబ్సిడీ జమయ్యే బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేస్తామని తెలుపుతూ, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కు ఎయిర్‌టెల్‌ లేఖ రాసింది. 
 
అంతేకాకుండా, ఆధార్ - సిమ్ అనుసంధాన ధ్రువీకరణ లైసెన్సును కూడా తాత్కాలికంగానూ, పేమెంట్స్‌బ్యాంక్‌ ఖాతాదారులకు ఎలక్ట్రానిక్‌ (ఇ) కేవైసీ నిర్వహించడాన్నీ రద్దు చేసింది.

భారతీ ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌బ్యాంక్‌లలో ఆడిట్‌ నిర్వహించాలని ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ను ఆధార్‌ జారీ సంస్థ యూఐడీఏఐ కోరింది. ఆధార్‌ చట్టానికి అనుగుణంగా ఆయా సంస్థలు వ్యవహరిస్తోందీ, లేనిదీ పరిశీలించాలని ఆదేశించింది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Yami Gautam: చలాకి కోడలు గా యామీ గౌతమ్ చిత్రం నయ్యి నవెల్లి

Anil Ravipudi: వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం పేరు జనవరి 12 విడుదల

Shravan Reddy: అగధ లో హీరోగా, యాంటీ హీరోగా సర్‌ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి

Vedha Jalandhar: బిర్యానీ ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ, ఆమిర్ లోగ్ మహిళలకు స్ఫూర్తినిస్తుంది: వేధా జలంధర్

జానీ మాస్టర్‌పై నిషేధం కొనసాగుతుంది : ఫిల్మ్ ఫెడరేషన్

తర్వాతి కథనం