ఫేస్‌బుక్‌తో జాగ్రత్త.. భద్రత కరువు.. యూజర్ల ఫోన్ నెంబర్లు లీక్

శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (11:35 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌‍బుక్ తరచూ వివాదంలో చిక్కుకుంటోంది. యూజర్ల డేటాలో భద్రత లేదని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్.. మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్‌బుక్ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా 41.9 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల వివరాలు బహిర్గతమయ్యాయని టెక్‌ క్రంచ్‌ అనే మీడియా సంస్థ తెలిపింది. 
 
ఈ యూజర్ల వివరాల్లో 13.3 కోట్ల మంది అమెరికన్లు ఉండగా, 5 కోట్ల మంది వియత్నామీలు, 1.8 కోట్ల మంది బ్రిటిషర్లు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనలో ఫేస్‌బుక్ యూజర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చేశాయని పేర్కొంది. 
 
ఫేస్‌బుక్‌ సర్వర్‌కు పాస్‌వర్డ్‌ రక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని టెక్ క్రంచ్ మీడియా సంస్థ వెల్లడించింది. దీని కారణంగా ఈ సర్వర్ నుంచి యూజర్ల పూర్తి వివరాలను తీసుకునే వీలుంటుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ వ్యవహారంపై ఫేస్‌బుక్ స్పందించింది. 20 కోట్ల యూజర్ల వివరాలు బయటపడ్డాయని ఫేస్ బుక్ తేల్చింది. కానీ ఈ సమాచారమంతా చాలా పాతదంటూ వివరణ ఇచ్చింది.

అన్నీ చూడండి

Aishwarya Rajesh :ఇసకపట్నం పై ఆధిపత్యం చేసే సముద్రఖని కి సవాల్ గా మారిన ఐశ్వర్య రాజేష్

Tatvam trailer: మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా తత్వం ట్రైలర్‌

Sridevi : శ్రీదేవి, ఫెమినా జార్జ్ చిత్రం హైకూ చిత్రీకరణ పూర్తి

Senior Naresh: అప్పుడు నాలుగు స్తంభాల ఆట - ఇప్పుడు దీవానా

Risk Review : ఘంటాడి క్రిష్ణ చేసిన రిస్క్ ప్రేక్షకులకు మరింత రిస్క్.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments