బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (13:00 IST)

వివో నుంచి వివో వీ29, వివో వీ29 ప్రో.. ఫీచర్స్.. రేట్లు ఇవే

Vivo V29
Vivo V29
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి వివో వీ29, వివో వీ29 ప్రో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. వివో వీ29 ఫోన్ మూడు కలర్ ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తోంది.
 
హిమాలయన్ బ్లూ, మేజిస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్ రంగుల్లో వస్తున్నాయి. వివో వీ29 ప్రో ఫోన్ రెండు కలర్ ఆప్షన్లు హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండు ఫోన్లూ 6.78 -అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ స్లీక్, స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటాయి. 
 
వివో వీ 29 ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్లు- 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 
 
వివో వీ29 ప్రో ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.39,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.42,999లకు లభిస్తాయి. 
 
ఈ నెల పదో తేదీ నుంచి వివో వీ29 ప్రో, ఈ నెల 17వ తేదీ నుంచి వివో వీ29 ఫోన్ సేల్స్ ప్రారంభం అవుతాయి. వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, క్ర్మా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ తదితర రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
 
8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.32,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.36,999లకు లభిస్తాయి.